ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించండి: చిత్తూరు ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 09:42 AM

ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని చిత్తూరు ఎమ్మెల్యే ఏ. శ్రీనివాసులు అన్నారు. ఆదివారం జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమం పై శనివారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాను పోలియో రహిత మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అమ్ముదా , డి ఐ ఓ రవి రాజు , నగర కమిషనర్ విశ్వనాథ్ మరియు ప్రజా ప్రతినిధులు సిబ్బందులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa