అభిరామిదేవి సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. మంగళవారం నెల్లూరు పప్పుల వీధిలో ఉన్న అమరేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా బిల్వ దళార్చనను శాస్త్రోక్తంగా పండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఛైర్మన్ రఘురామిరెడ్డి సారధ్యంలో కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులకు తీర్ద, ప్రసాద వినియోగం చేసి 1000 మందికి పైగా వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ కార్యనిర్వాహకులకు రాము కేఫ్ అధినేత గుబ్బ రాము శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa