గుంటూరు జిల్లా మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మంగళగిరి ఆటో నగర్ లోని ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ( ఎండీ ) జేవీఎస్ సుబ్రహ్మణ్యం ఫొటోతో గుర్తు తెలియని వ్యక్తి అక్రమాలకు పాల్పడుతున్నట్లు సంస్థ సీజీఎం జ్యోతిబసు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎండీ ఫొటోను తన వాట్సప్ డీపీగా ఉంచిన ఆ వ్యక్తి సదరు అధికారి పంపినట్లుగా ఉద్యోగులకు సంక్షిప్త సందేశం పంపుతున్నట్లు పోలీసులు చెప్పారు. అగంతుకుడి ఆచూకీ తెలుసుకుని చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో కోరారని పోలీసులు వెల్లడించారు. త్వరలోనే నిందితుడిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa