వేమూరునియోజకవర్గం, మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని రామినేని పౌండేషన్ ప్రతిభా పురస్కార అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్. జి. యు. కే. టి, ఎంట్రన్స్ లో అమృతలూరు మండల టాపర్ గా షేక్. ఆయేషా తస్లీమా నిలిచారు.
ఈ విద్యార్థినికి మార్చి ఒకటో తేదీన గుంటూరు - విజయవాడ హైవే రోడ్ లో ఉన్న సి. కె, కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగిన వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేశారు.
ఈ పురస్కారాలు అవార్డుకు ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల నగదు, సర్టిఫికెట్, మెమొంటో, మెడల్ అందించారు. ఈ క్రమంలో ఆయేషా తస్లీమా ను ఎం. పీ. పీ, రాపర్ల నరేంద్ర కుమార్, మాజీ ఎం. పీ. పీ, లు మైనేని రత్నప్రసాద్, గొట్టిపాటి పూర్ణ కుమారి భాను గంగాధర్ అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa