కృష్ణా జిల్లా: పెడన పట్టణంలోని 22 వ వార్డు రామలక్ష్మి కాలనీలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మూడో వార్డుకి చెందిన మొహమ్మద్ రఫీ(45) గురువారం డ్రైనేజీ లో పడి మృతి చెందిన ఈ విషయం వెలుగు చూసింది. ట్రాన్స్ ఫార్మర్ పక్కనే మృతుడు పడి ఉండడంతో కరెంట్ షాక్ వల్ల మృతి చెందాడా, లేక మద్యం మత్తులో తూలి డ్రైనేజీలో పడ్డాడా తెలియాల్సి ఉంది. మద్యం సేవించే అలవాటు నేపద్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది అన్న కోణంలో పోలీసులు ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa