కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 156 దేశాల పౌరుల కోసం ఈ-టూరిస్ట్ వీసాను అమలులోకి తీసుకువచ్చింది. కరోనా నేపథ్యంలో ఈ-టూరిస్ట్ వీసాల జారీని 2020 మార్చి నిలిపి వేశారు. ప్రస్తుతం జారీ చేయనున్న టూరిస్ట్ వీసాలు ఐదేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. యూఎస్, జపాన్ పౌరుల దీర్ఘకాలిక (పదేళ్ల) రెగ్యులర్ టూరిస్ట్ వీసాలను సైతం పునరుద్ధరించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.