ఏపీ సీఎం జగన్ జగనన్న విద్యా దీవెన నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బుధవారం జమ చేశారు. అక్టోబర్-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు రూ. 709 కోట్లను సచివాలయంలో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరూ దొంగిలించలేని ఆస్తి చదువు అని అన్నారు. జగనన్న విద్యా దీవెన కింద 10.82 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీజురీయింబర్స్‌మెంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం మొత్తం రూ. 9,274 కోట్లు చెల్లించింది.