నేపాల్ ప్రభుత్వం పర్వతారోహకుల ఫీజును 36 శాతం పెంచింది. దీనికి సంబంధించి కొత్త నిబంధనలను ఆ దేశ టూరిజం శాఖ విడుదల చేసింది.
మార్చి నుంచి మే నెల మధ్య ఎవరెస్ట్ పర్వతాన్ని.. దక్షిణ వైపు నుంచి ఎక్కే పర్వతారోహకులకు ఫీజును 11,000 డాలర్ల నుంచి 15,000 డాలర్ల(సుమారు రూ.13 లక్షలు)కు పెంచినట్లు టూరిజం బోర్డు డైరెక్టర్ హారతి న్యుపేన్ తెలిపారు. దీనిపై అధికారికంగా ప్రకటన వెలుబడాల్సి ఉంది.