రాయచోటిలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కార్యాలయంలో గురువారం మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత, శ్రీ కృష్ణారెడ్డి సేవా సంస్థ వ్యవస్థాపకులు జ్ఞానేందర్, దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.