ఉపాధిహామి పథకంలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈనెల 22న విజయవాడలో తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ తాడిపత్రి నియోజవర్గ కార్యదర్శి రంగయ్య కోరారు. పెద్దపప్పూరు మండలంలోని నామనాంకపల్లి గ్రామంలో శుక్రవారం ధర్నాకు తరలి రావాలని ప్రచారం చేశారు. గ్రామానికి చెందిన రామేశ్వరరెడ్డితో పాటు పలువురు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పార్టీలోకి చేరారు. సీపీఐ మండల కార్యదర్శి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.