ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బార్ అసోసియేషన్ ఎన్నికలకు ప్రారంభమైన సందడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 08:45 AM

రేపల్లె న్యాయవాదుల సంక్షేమ సంఘం (బార్అసోసియేషన్)కు 2022-23 సంవత్స రానికి నూతన కార్యనిర్వాహక వర్గం ఎన్నికలకు 5 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి గుజ్జర్లమూడి ప్రశాంతకుమార్ తెలిపారు. రేపల్లె బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ ప్రక్రియల్లో భాగంగా తొలిరోజు అధ్యక్ష పదవికి 2, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కు 2, కోశాధికారికి 1 చొప్పున నామినేషన్లు అందాయన్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తోందన్నారు. 24న నామినేషన్ పరిశీలన, ఉపసంహరణ, 28న ఉదయం ఎన్నికల నిర్వహణ, అదేరోజు సాయంత్రం 4. 30 గంటలకు ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల చేయడం జరుగుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa