ప్రపంచ క్షయ వ్యాధి నివారణా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు టీబీ కంట్రోల్ అధికారి డా. టి. రాణీ సంయుక్త తెలిపారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగుతుందని వివరించారు. ర్యాలీలో జాయింట్ కలెక్టర్, జిల్లా వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం స్థానిక డీఎం & హెచ్‌వో కార్యాలయంలో సమావేశం జరుగుతుందని వివరించారు. జిల్లాలోని 14 వైద్య బృందాల్లో ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ప్రపంచ క్షయ వ్యాధి నివారణా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రశంసా పత్రాలు అందజేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. డా. వి. ఉదయ్ కుమార్, ఇతర వైద్యులు, టీబీ ఆసుపత్రి సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa