ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజాం నియోజక వర్గ సమస్యలను అసెంబ్లీ లో ప్రస్తావించిన ఎమ్మెల్యే కంబాల జోగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 11:19 AM

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 11వ రోజు జీరో హవర్లో ప్రధానంగా రహదారి సమస్యలు ప్రస్తావించారు. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అధ్యక్షతన జరిగిన శాసనసభ సమావేశంలో జీరో హావర్లో ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ ప్రధానంగా రాజాం నుంచి పాలకొండ మెయిన్ రోడ్, రాజాం నుండి సంతకవిటి మీదుగా పొందూరుకు డబుల్ రోడ్డు, అరసాడ నుండి వంగరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ముఖ్యంగా పాలకొండ - రాజాం రహదారిని హైవే రోడ్డు మాదిరిగా ఆరు లైన్లుగా విస్తరణ చేయాలని సభా సాక్షిగా విన్నవించారు. రేగిడి ఆమదాలవలస మండలం ఎల్. కే గెడ్డ, రేగిడి, సంతకవిటి మండలాల్లో సాయన్న గెడ్డను అభివృద్ధి చేసి ఆయకట్టు ముంపు ప్రాంతాలు రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వంగర మండలం వి. వి. ఆర్. పేట, రేగిడి మండలం బూరాడ, సంతకవిటి మండలం హోంజారం గ్రామాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని శాసనసభ సాక్షిగా తెలియజేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa