ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రహస్యంగా 3 పెళ్లిళ్లు.. మూడో భర్త ఏం చేశాడంటే

national |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 12:33 PM

టిండర్‌ యాప్‌ ద్వారా పురుషులతో పరిచయం పెంచుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ కిలాడీ లేడిపై ఆమె మూడో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మహిళ ప్రేమ పేరుతో యువకులకు దగ్గర కావడం, ఆపై పెళ్లి చేసుకుని కొన్నాళ్లకు విడిపోవడమే పనిగా పెట్టుకుంది. ఈమె చేస్తున్న మోసాలను పసిగట్టిన మూడో భర్త ఆమె నిర్వాకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


వివరాల్లోకి వెళితే.. మైసూరులోని ఉదయగిరికి చెందిన నిధా ఖాన్‌ 2019లో ఆజామ్‌ఖాన్‌ కు టిండర్‌ యాప్‌లో పరిచయం అయ్యింది. ఆ తర్వాత అతడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే కొన్నిరోజులకే నిధాఖాన్‌ ప్రవర్తనలో తేడాను గమనించిన ఆజామ్‌ ఖాన్‌ ఆరా తీశాడు. అప్పటికే ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని, వారి నుంచి ఆమె విడిపోయిందని తెలుసుకున్నాడు. ఆన్‌లైన్ లో మరికొందరు పురుషులతో ఆమె చాటింగ్‌ చేస్తోందని మైసూరులోని ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో వ్యక్తితో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నట్లు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa