ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో రౌండ్ కు చేరుకున్న సైనా, సింధు

national |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 12:46 PM

స్విస్​ ఓపెన్​ మహిళల సింగిల్స్​లో భారత స్టార్​ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్​ రెండో రౌండ్​కు చేరుకున్నారు. డెన్మార్క్​ క్రీడాకారిణి హొజ్​మార్క్​పై 21-14, 21-12 తేడాతో సింధు విజయం సాధించింది. సింధు తన తర్వాతి మ్యాచ్​లో చైనా క్రీడాకారిణి నెస్లిహాన్​ తో తలపడనుంది. సైనా నెహ్వాల్ స్పెయిన్​ క్రీడాకారిణి యాలీ హోయాక్స్​ను వరుస సెట్లలో (21-8, 21-13) ఓడించి రెండో రౌండ్ కు చేరుకుంది. మహిళల డబుల్స్​లో అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి జంట తొలి రౌండ్​లో విజయం సాధించింది. పురుషుల డబుల్స్​లో అర్జున్​, ధ్రువ్ కపిల జోడీ ఓటమి పాలైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa