ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నేత అహంకారానికి ఒక ముస్లిం బాలిక బలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 12:55 PM

చిత్తూర్ జిల్లా , పలమనేరు లో ఒక అవమనీయ సంఘటన చోటు చేసుకుంది. రాజకీయ నేతల పోకడలకు ఒక చిన్నారి బలి దానమైనది. వివరాల్లోకి వెళ్ళితే సోడాలు అమ్ముకునే ఒక చిన్న ముస్లిం వ్యాపారి కూతురే మిస్బా. తన స్కూల్ లో 10 తరగతి చదువుతుండగా , క్లాస్ లో ఈమెదే మొదటి రాంక్ . అసలు ఈమె మొదటి స్థానంలో ఉండటమే ఈ బాలికకు  శాపంగా మారింది . అదే స్కూల్ లో అదే క్లాస్ లో చదువుతున్న ఒక వైసీపీ నేత కూతురు కోసం, నా కూతురు మాత్రమే మొదటి స్థానంలో ఉండాలి అనే ఆలోచనతో మిస్బా మీద బెదిరింపులు మొదలైనాయి. వెంటనే స్కూల్  మారిపోవాలి లేకుంటే ఊరుకోము అంటూ బెదిరించడం జరిగింది. ప్రిన్సిపాల్ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం చేసారు. అలానే, వైసీపీ నేత కూతురు కూడా సోడాలు అమ్ముకునే వాళ్ళకి ఎందుకు ఇలాంటి స్కూల్ అని కొంత మంది స్నేహితులతో కలిసి హేళన చెయ్యడం మొదలుపెట్టింది. ఇలాంటి వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురైన మిస్బా సూసైడ్ లేఖ వ్రాసి  ఆత్మహత్యకి పాల్పడింది. 


 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa