ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వృద్ధుడి మీదుగా దూసుకెళ్లిన కారు

national |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 05:02 PM

యూపీలోని ఘజియాబాద్‌లో బుధవారం ఒక వృద్ధుడి మీదుగా కారు దూసుకెళ్లింది. వృద్ధుడు తన ఇంటి ముందు ఉండగా, ఇంతలో ఇరుకైన ఆ సందులోకి ఒక కారు ప్రవేశించింది. కుర్చీని పట్టుకుని నిల్చొన్న వృద్ధుడి మీదుగా ఆ కారు దూసుకెళ్లింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం అనంతరం డ్రైవర్‌ ఆ కారును ఆపకుండా వెళ్లిపోయాడు. ఉద్దేశపూర్వకంగానే తన పైనుంచి కారును నడుపుకుంటూ వెళ్లారని ఆ వృద్ధుడు ఆరోపించాడు. పొరుగువారితో 6 నెలల కిందట జరిగిన గొడవే దీనికి కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సమీపంలోని ఇంటి సీసీటీవీలో రికార్డైన వీడియో ఫుటేజ్‌ను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa