హిజాబ్ అనంతరం కర్ణాటకలో హలాల్ మాంసం బహిష్కరణ వివాదం మొదలైంది. హలాల్ మాంసాన్ని కొనవద్దని కొన్ని హిందూ సంస్థలు ప్రచారం మొదలుపెట్టాయి. ఉగాది మరుసటి రోజు మైసూరు, రామనగర, మాండ్య జిల్లాల్లో హొసతోడ జరుపుకుంటారు. ఆరోజు హిందువులు మాంసం తింటారు. ఈ మాంసాన్ని ముస్లింల నుంచి కొనవద్దని ప్రచారం మొదలవగా స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై ఇది ప్రభుత్వ ప్రకటన కాదని గమనించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa