రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీలను పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. దీనిపై ఎల్లుండి నిరసన తెలుపుతున్నామని ప్రకటిస్తూ ఆయన ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. 'జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి అడ్డగోలుగా ప్రజల్ని మోసం చేశారు. పేద ప్రజల నడ్డివిరిచేలా పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బుధవారం సాయంత్రం 5 గంటలకు నర్సీపట్నం శ్రీకన్య కూడలి నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిరసన ర్యాలీ చేపట్టబోతున్నాము. ప్రజలు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa