హడావుడి జీవితంలో మన పాత ఆహార అలవాట్లకు దూరమై హాట్ హాట్ గా త్వరగా తయారయ్యే జంక్ ఫుడ్ ల వైపు మనం చూస్తున్నాం. కానీ ఇది ఏ మాత్రం ఆరోగ్య కరం కాదు. ఈ మధ్య కాలంలో పిల్లలు మొదలు పెద్దల వరకూ జంక్ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయారు. జంక్ ఫుడ్ వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు ఉండదు. కేవలం ఇబ్బందులు మాత్రమే వస్తాయి. జంక్ ఫుడ్ మరియు ఫాస్ట్ ఫుడ్‌కి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి. ముఖ్యంగా నలభై ఏళ్లు దాటిన వాళ్ళు వీటిని అస్సలు డైట్లో తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగి పోతుంది అదే విధంగా ఇంఫ్లమేషన్ పెరిగిపోయి సమస్య కూడా కలుగుతుంది కాబట్టి జంక్ ఫుడ్‌కి మానేస్తే కొవ్వు తగ్గుతుంది అలానే ఇన్ఫ్లమేషన్ సమస్య కూడా ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ఈ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకొని అనుసరించండి లేదంటే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది.