ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబుపై ప్రేమతో...మినీ వ్యాన్ కాస్త యుద్ద ట్యాంకర్ గా మార్పు

international |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 01:51 PM

పుత్రవాత్సల్యం ఎవరినైనా ఎంతటి పనినైనా చేయిస్తుంది. సహజంగా కొడుకు మీద ప్రేమతో తండ్రులు... బైక్‌లు, కార్లు కొనిస్తుంటారు. కొంతమంది తమ తాహతుకు మించే వారి కోరికలు తీరుస్తుంటారు. లేదా వారి కోసం ఇంకా ఎక్కువ కష్టపడుతుంటారు. అంతగా తమ బిడ్డలను ప్రేమిస్తుంటారు. అలాగే వియత్నాంలో ఓ వ్యక్తి తన కొడుకు కోసం అంతే కష్టపడ్డాడు. తన గారాల తనయుడు కోసం మూడు నెలలు కష్టపడ్డాడు. పైగా లక్షలాది రూపాయలు ఖర్చు చేశాడు. వియత్నాం రాజధాని హనోయికి తూర్పున ఉన్న బాక్ నిన్హ్ ప్రావిన్స్‌కు చెందిన ట్రూంగ్ వాన్ దావోకు 16 సీట్ల మినీ బస్సు ఉండేది. తన కొడుకు కోసం ట్రూంగ్ వాన్ దావో ఆ మినీ వ్యాన్‌ను చెక్కతో యుద్ధ ట్యాంకులా మార్చాలనుకున్నాడు. అనుకున్న వెంటనే పని మొదలుపెట్టాడు. అయితే దానిని చెక్క యుద్ధ ట్యాంకుగా మార్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే వారు అనుకున్న విధంగా 9.1 అడుగుల పొడవుతో ఫ్రెంచ్ EBR105 మోడల్‌గా మార్చడానికి మూడు నెలలు పట్టింది. దీనికోసం ట్రూంగ్ వాన్ దావో ముందు మినీ వ్యాన్ నుంచి విడివిడి భాగాలను బయటకు తీశాడు. దాని ప్రధాన ఇంజన్‌ను, ఫ్లోర్‌ను అలాగే ఉంచి, చెక్క ట్యాంక్‌కు అవసరమైన అన్ని గేర్‌లకు సరిపోయేలా లోపలి భాగాన్ని తిరిగి అమర్చాడు. అయితే తయారీలో చక్రాలను అమర్చడమే కష్టతరమైందని దావో చెప్పాడు. ఎందుకంటే యుద్ధ ట్యాంకుకు చక్రాలన్నీ ఏకకాలంలో కదలాలి, అలా అమర్చడానికి చాలా రోజులు పట్టిందంట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa