మనం పెట్టే డబ్బును బట్టే నాణ్యమైన వస్తువులు లభిస్తాయి. మరి అత్యధికంగా డబ్బుపెడితేనే నాణ్యమైన విద్య అంటోంది స్వీట్జర్లాండ్‌లోని కొన్ని పాఠశాలలు. ఖరీదైన దుస్తులు, ఖరీదైన వస్తువులను చూశాం.. మరీ ఖరీదైన స్కూల్స్ గురించి విన్నారా..? నిజానికి ఇప్పుడు చదువు కాస్ట్లీగానే మారింది. పిల్లల ఫీజులు కట్టాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. కానీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో అత్యంత ఖరీదైన పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలల్లో చదవాలంటే లక్షల్లోనే జీతాలు చెల్లించుకోవాలి. అయితే అక్కడ అందించే చదువు, వసతులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. అలా స్వీట్జర్లాండ్‌లో ఓ స్కూల్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్కూల్‌గా ప్రసిద్ధికెక్కింది. ఈ స్కూల్ పేరు ఇన్స్టిట్యూట్ లె రోసే. ఈ పాఠశాల ఒక్కో విద్యార్థి నుంచి లక్షా 30 వేల డాలర్లు వసూలు చేస్తోంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.99 లక్షలు. ఇన్ని లక్షలు తీసుకోవడం కాదు.. దానికి తగ్గట్టుగానే విద్యార్థులకు వసతులను, చదువును కూడా అందిస్తోంది. ఈ స్కూల్ స్విట్జర్లాండ్‌లోని జెనీవా సరస్సు దగ్గరలో ఉంటుంది. 1880లో పాల్ కార్నల్ అనే వ్యక్తి దీనిని స్థాపించాడు. మంచి గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్స్, టెన్నీస్ కోర్టులు వంటి ఎన్నో వసతులు ఉంటాయి. ఈ స్కూల్లో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. క్లాస్ రూమ్‌కు కేవలం పదిమంది కంటే తక్కువే మందే విద్యార్థులు ఉంటారు. విదేశీ విద్యార్థులకు, ఈ స్కూల్లో బోధించే టీచర్ల పిల్లలకు కూడా సీట్లు కేటాయిస్తారు. ప్రతి సంవత్సరం కేవలం ముగ్గురికి మాత్రమే స్కాలర్ షిప్ అందిస్తారు. అలాగే విద్యార్థులు తక్కువ మంది టీచర్లు ఎక్కువమంది ఉంటారు. దీంతో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు. సాధారణంగా యూరప్‌లో పాఠశాలలు ఖరీదైనవిగానే ఉంటాయి. ఇలాంటి పాఠశాలలు ఇంకో నాలుగు ఉన్నాయి. కానీ అన్నింటి కంటే ఇన్స్టిట్యూట్ లె రోసే అత్యంత ఖరీదైనది. కాలేజ్ ఆల్పిన్ బ్యూ సోలీల్, యూకేలో హర్ట్‌వుడ్ హౌస్ స్కూల్, థింక్ గ్లోబల్ స్కూల్, లేసిన్ అమెరికన్ స్కూళ్లు కూడా చాలా ఖరీదైనవి. ఈ పాఠశాలల్లోనూ ఫీజులు లక్షల్లోనే ఉన్నాయి. కాలేజ్ ఆల్పిన్ బ్యూ సోలీల్ స్కూల్లో (Collège Alpin Beau Soleil) కేవలం 260 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. 50 దేశాలకుపైగా విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకుంటున్నారు. ఈ స్కూల్లో ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లో పాఠాలు బోధిస్తారు. ఇక యూకేలో హర్ట్‌వుడ్ హౌస్ స్కూల్లో 350 మంది విద్యార్థులు ఉంటారు. ఇక థింక్ గ్లోబల్ స్కూల్, లేసిన్ అమెరికన్ పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి. ఈ స్కూళ్లు ఫీజులు 60 నుంచి 80 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. అయితే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో మాత్రం రాజీ పడరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa