ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంధుల కోసం...స్మార్ట్ షూలు...అసోం విద్యార్థి ఆద్భుత ఆలోచన

national |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 01:54 PM

ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో ఎవరికీ తెలియదు. అలాంటి ఘటనే  ఇటీవల చోటు చేసుకొంది. అసోంలో ఓ అబ్బాయి అద్భుతమైన పని చేసి వార్తల్లో నిలిచాడు. అంధుల కోసం ప్రత్యేకమైన షూలను తయారు చేశాడు. సాధారణంగా కళ్లు లేని వారు బయటకు వెళ్లాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇంకొకరు సాయం లేకుండా ఎక్కడకీ వెళ్లలేని పరిస్థితి. రోడ్డు దాటేటప్పుడన్నా వేరేవాళ్లు సాయం చేయాల్సిందే. అలాంటి వారికి ఉపయోగపడే ఉద్దేశంతో అంకురిత్ అనే అబ్బాయి స్మార్ట్‌ షూలను తయారు చేశాడు. కరీంగంజ్ జిల్లాకు చెందిన అంకురిత్ కర్మాకర్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇంత చిన్న వయస్సులోనే దృష్టి లోపం ఉన్నవారి కోసం ఆలోచించాడు. వారికి ఉపయోగపడే విధంగా సెన్సార్ ఎనేబుల్డ్ స్మార్ట్ షూని రూపొందించాడు. ఈ షూలు వేసుకుని వెళ్లేటప్పుడు దారిలో ఏదైనా అడ్డుగా వస్తే వెంటనే సౌండ్ వస్తుంది. దాంతో తన ముందు ఏదో ఉందని గ్రహించి అప్రమత్తం అవ్వొచ్చు. దీనికోసం షూల్లో సెన్సార్లతో తయారు చేసే ఓ బజర్‌ను ఏర్పాటు చేశాడు. " వెళ్లే మార్గంలో ఏదైనా అడ్డంకి ఉంటే షూలోని సెన్సార్ దానిని గుర్తించి వెంటనే బజర్ మోగుతుంది. దృష్టి లోపం ఉన్న వ్యక్తి దానిని వినగలుగుతారు. వెంటనే అప్రమత్తమై తన ముందున్న అడ్డంకి నుంచి తప్పించుకోగలుగుతారు" అని అంకురిత్ కర్మాకర్ చెప్పాడు. అంకురిత్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని పరికరాలను తయారు చేయాలనుకుంటున్నాడు. "ఈ షూలను అంధుల కోసం తయారు చేశాను. సైంటిస్ట్ అవ్వడం నా లక్ష్యం. ఇలాంటి వారికి సాయం చేసే విధంగా ఇలాంటివి చేస్తూనే ఉంటాను." అని అంకురిత్ అన్నాడు. ఇంత గొప్ప పని చేసిన అంకురిత్‌‌‌‌పై ప్రశంసలు వర్షం కురుస్తోంది. ఇంత చిన్న పిల్లవాడు ఇలాంటి షూలు కనిపెట్టడం సాధారణమైన విషయం కాదంటున్నారు. అంకురిత్ చేసిన పనికి ట్విట్టర్‌లో తెగ లైకులు వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa