ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్న వయస్సులోనే భుజాలపై పెద్ద బాధ్యత...కదిలిస్తున్న ఆ ఫోటో

national |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 01:55 PM

ఎంతపెద్ద గాథనైనా ఒకే ఒక ఫోటో చెప్పేస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ఫోటో అందరి మనస్సును కదలించేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఫోటో.. ఎంతోమందిని కదిలించింది. ఓ కుటుంబం పడుతున్న కష్టాలను కళ్ల ముందు ఉంచింది. పదేళ్ల వయస్సులోనే బాధ్యతను, ఆసక్తిని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో తెలియజేసింది. తరగతి గదిలో ఒక చిన్నారి.. ఒడిలో పసిదానితో పాఠాలు వింటున్న ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా అందరి దృష్టి ఆ చిన్నారిపై పడింది. దాంతో ఆ పాప జీవిత కథ ముందుకు వచ్చింది. ఆ ఫోటో మణిపూర్‌ రాష్ట్రంలో ఓ మారుమూల గ్రామానికి చెందిన పాపది. తమెంగ్‌లాంగ్‌కు చెందిన పదేళ్ల చిన్నారి మానింగ్‌సిలియు పమి (Meiningsinliu Pamei) నాలుగో తరగతి చదువుతుంది. అయితే తన తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయ పనులకు వెళ్లడంతో తన రెండేళ్ల చెల్లెలిని తనే చూసుకోవాలి. మరోవైపు చదువుకోవాలి. దీంతో చెల్లెల్ని తీసుకుని పాఠశాలకు వెళ్లింది. ఆ పసిదాన్ని ఒళ్లో కూర్చొబెట్టుకొని తరగతి గదిలో శ్రద్ధగా పాఠాలు వింటుంది. ఆ సమయంలో తీసిన ఫోటోని ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేశారు. పమి ఫోటోలు చూసిన నెటిజన్లు భారీగా స్పందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa