ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యా విధానం దారితప్పితే...ఇలాగే ఉంటుంది

national |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 01:57 PM

విద్యా విధానంలో కొందరు కొత్త కొత్త అంశాలను చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై అక్కడక్కడా నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టరీత్యా నేరం. ఈ సామాజిక దురాచారాన్ని ఎప్పుడో నిషేధించారు. అలాంటిది వరకట్నం వల్ల ప్రయోజనాలు ఉన్నాయంటూ పాఠ్యాంశంలో చేర్చచం చర్చనీయాంశమవుతోంది. దీనికి సంబంధించి పాఠ్యాంశం ఉన్న ఆ పేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నర్సింగ్ కోర్సు పాఠ్య పుస్తకంలో ‘వరకట్న వ్యవస్థ వల్ల ప్రయోజనాలు’ అనే పాఠ్యాంశాన్ని చేర్చడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇటువంటి పాఠ్యాంశాలతో యువతకు, సమాజానికి ఎలాంటి సందేశాన్ని పంపుతున్నారని జనం ఆశ్చర్యపోతున్నారు. నర్సింగ్ కోర్సుకు సంబంధించి సోషియాలజీ సబ్జెక్టులో వరకట్నం ప్రయోజనాలను ఓ పాఠంగా పేర్కొన్నారు. టీకే ఇంద్రాణి అనే ఆథర్ ఈ పుస్తకాన్ని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సిలబస్ ఆధారంగా సంకలనం చేసినట్టు కవర్ పేజ్‌లో పేర్కొన్నారు. ఈ పేజీను సోషల్ మీడియాలో శివసేన నాయకురాలు, రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది షేర్ చేస్తూ.. పాఠ్యాంశాన్ని తొలగించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ట్యాగ్ చేశారు. కరికులమ్‌లో ఇటువంటి పాఠ్యాంశాలు ఉండటం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa