లాక్ డౌన్ ప్రజలు సంచరించకుండా ఇళ్లకే పరిమితం చేసింది. ఫలితంగా ఇంట్లో కూర్చోని ప్రజలు బరువెక్కిపోయారు. లాక్‌డౌన్ సమయంలో బరువు పెరిగిపోయామని ఎవరైనా బాధపడుతున్నారా..? అలాంటి వారి కోసం అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. బరువు పెరిగిపోయామని మీరే బాధపడనక్కర్లేదు. ఎందుకంటే మీలాగే చాలామంది బరువు పెరిగారంట. 2020లో సంవత్సరంలో ఎక్కువ మంది బరువు పెరిగిపోయారని ఓ సర్వేలో తేలింది. 2019 కంటే 2020లో ఎక్కువ మంది ఊబకాయులుగా మారారని తెలిసింది. కోవిడే దీనికి కారణమని పరిశోధకులు గుర్తించారు.
ఓ జాతీయ సర్వేలో ఈ షాకింగ్ నిజాలు తెలిశాయి. ఈ వివరాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో పబ్లిష్ చేశారు. సర్వే ప్రకారం అమెరికాలో 2019 కంటే 2020లో 3.5 మిలియన్ల కంటే ఎక్కువ మంది (20 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు.) బరువు పెరిగారంట. ముందు సంవత్సరంతో పోల్చుకుంటే 2020లోనే మూడు శాతం అధికంగా బరువు పెరిగారు. అలాగే నాలుగు కారణాల వల్లే ప్రజలు బరువు పెరిగినట్టు తెలిసింది. వ్యాయామం చేయకపోవడం, అతి నిద్ర, మద్యపానం, దూమపానాల వల్ల వ్యక్తుల్లో ఒబెసిటీ పెరిగింది. వ్యాయామం లేకపోవడంతో పాటు ఎక్కువ నిద్ర పోవడం వల్ల చాలామంది బాడీ మాస్ ఇండెక్స్ సగటున 0.6 శాతం పెరిగింది.
కోవిడ్ వల్ల లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితయ్యారు. దాంతో ఇంట్లో ఖాళీగా ఉన్నవారు అధికంగా తినడం, ఆల్కాహాల్ తీసుకోవడం, శారీరకంగా శ్రమించకపోవడం వల్లే ఎక్కువమంది బరువు పెరిగిందని తెలిసిందని ఈ పరిశోధనను లీడ్ చేసిన ప్రధాన పరిశోధకుడు బ్రాండన్ జే రెస్ట్రెపో తెలిపారు. "ఊబకాయం కొంతమందిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి జనాభా వయోజన స్థూలకాయం రేటులో మార్పులను మరింత తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది" అని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa