ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొందరికి మళ్లీ మంత్రి పదవులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 05:55 PM

ఏపీ మంత్రులంతా రాజీనామా చేశారు. దీంతో కొత్త మంత్రి వర్గం ఏప్రిల్ 11న కొలువుతీరునుంది. రాజీనామా చేసిన మంత్రుల్లో కొంత మందిని కొనసాగిస్తామని సీఎం జగన్ చెప్పారని కొడాలి నాని తెలిపారు. 5 లేదా ఆరుగురు మంత్రులు మళ్లీ మంత్రులుగా కొనసాగే అవకాశం ఉందని సమాచారం.


ఇప్పుడు మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన వారిలో ఓ ఐదుగురో, ఆరుగురో తిరిగి కొత్త మంత్రివ‌ర్గంలో ప‌నిచేసే అవ‌కాశాలున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ప‌నితీరులో స‌త్తా క‌న‌బ‌ర‌చిన వారో, అనుభ‌వ‌మున్న‌ సీనియ‌ర్లో, లేదంటే సామాజిక వ‌ర్గ స‌మీక‌ర‌ణాలో తెలియ‌దు గానీ... ఇప్పుడు రాజీనామాలు చేసిన వారిలో ఓ ఐదారుగురు మంత్రులకు కొత్త కేబినెట్‌లో చోటు ద‌క్కే అవ‌కాశాలున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అయితే ఆ ఐదారుగురు ఎవ‌ర‌న్న విష‌యం మాత్రం జ‌గ‌న్ ప్ర‌క‌టించే దాకా ఏ ఒక్క‌రికీ తెలియ‌ద‌నే చెప్పాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa