రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఇండ్లు కట్టిస్తున్నాం అని ఆర్భాటాలు చేస్తూ ప్రజలని మోసం చేస్తున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. కేంద్రం ఇస్తున్న నిధులను తమ పేరుతో చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనించాలి అని పిలుపునిచ్చారు. ఈ రోజు పార్వతీపురంలో నిర్మిస్తున్న గృహాల సముదాయాన్ని పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు రాష్ట్రా బీజేపీ నాయకులూ సోము వీర్రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రం 12 వేల కోట్ల రూపాయలు ఇచ్చినా కనీసం మౌలిక సదుపాయాల కల్పనలో కూడా విఫలమైన ఈ రాష్ట్ర పాలకులను అసమర్థ ప్రభుత్వం కాక ఇంకేమనాలి? ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చే నిధులకు వైసిపి రంగులు పులుముకోవడం తప్ప చిత్తశుద్ధితో చేసే అభివృద్ధి పని ఒక్కటి కూడా రాష్ట్రంలో కనిపించడం లేదు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa