సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు కు నూతన సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. విశాఖపట్నంలో ఈరోజు వీరందరినీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నూతన సభ్యులను కలుసుకోవడం సంతోషంగా ఉంది. సింహాచలంలో గిరిప్రదక్షిణ కోసం గోడ నిర్మాణానికి ఎంపీ లాడ్స్ నుంచి రూ. 5 కోట్లు మంజూరు చేస్తున్నాను అని ప్రకటించగానే పక్కనే ఉన్న అనకాపల్లి ఎంపీ తన వంతు సాయంగా రూ.3 కోట్లు కేటాయించడం గమనార్హం. దేవస్థాన అభివృద్ధికి అందరూ కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa