ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా రాష్ట్రంలో బీజేపీ అడుగు వేస్తుంది అనేలా , ప్రజల తరపున నిలబడి జరుగుతున్నా తప్పిదాలను ఎత్తి చూపించడానికి ప్రయాణం చేస్తుంది. తాజాగా ఈ రోజు అనగా శుక్రవారం జలం కోసం జన పోరు యాత్రలో భాగంగా 2వ రోజు జంఝావతి ప్రాజెక్టును బీజేపీ రాష్ట్ర నాయకులూ సోము వీర్రాజు ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పక్క రాష్ట్రం ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి అడ్డంకులు తొలగిస్తే సుమారుగా 40 వేల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది అన్నారు . ముఖ్యమంత్రి విలాసవంతమైన బంగ్లాలో కూర్చుంటే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావనే విషయాన్ని గ్రహించి ఉత్తరాంధ్ర రైతాంగానికి త్వరితగతిన న్యాయం చేయాలి అని డిమాండ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa