పుదీనాను వివిధ రకాల మాంసాహార, శాఖాహార వంటకాల్లో వినియోగిస్తాం. అంతేకాకుండా టీ లు, సలాడ్స్, మజ్జిగ, వివిధ రకాల జ్యూస్‌లలో కూడా పుదీనాను వాడుతారు. పుదీనాను జోడించడం ద్వారా వివిధ రకాల పదార్థాలకు చక్కని వాసన, రుచి కూడా వస్తుంది. అంతేగాక ఇది తక్కువ పరిమాణంలోనే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.
వేసవిలో పుదీనాను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. గుప్పెడు పుదీనా ఆకుల్లో ఒకరోజు మొత్తానికి కావాల్సిన విటమిన్-ఎ లో 10 శాతం లభిస్తుంది. అజీర్తి, గ్యాస్ సమస్యలను దూరం చేసుకోవడానికి పుదీనా సహాయపడుతుంది. ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా పుదీనా వేసి, కాచిన నీళ్లు తీసుకుంటే అది మెదడు చురుకుదనాన్ని పెంచి జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది. తరచూ పుదీనా ఆకులు నమలడం వల్ల నోటి దుర్వాసన సమస్యకు చెక్ పెట్టవచ్చు.