పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి కేసులో నిందితుడు అలీ కసిఫ్ జాన్‌ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. జైషే మహమ్మద్ శిబిరాల నుంచి భారత్‌లో దాడులకు అతడు ప్లాన్ చేసినట్లు తెలిపింది. 2016 జనవరిలో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు సైనికులతోపాటు ఓ పౌరుడు మరణించాడు. కాగా ఇప్పటికే పుల్వామా ఉగ్రదాడి నిందితుడు మొహియుద్దీన్ ఔరంగజేబ్‌ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa