ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో బ్రెవిస్ 49, తిలక్ వర్మ 36, సూర్య కుమార్ యాదవ్ 43, రోహిత్ శర్మ 28 పరుగులతో రాణించారు. ఈ సీజన్ లో ముంబై కి ఇది వరుసగా ఐదో ఓటమి. తిలక్ వర్మ, పోలార్డ్ రన్ అవుట్ కావడం వల్లే ముంబై గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమిపాలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa