మితిమీరిన ఎండలతో గొంతు ఎండిపోతుంది. తలనొప్పి, చెమటలు లాంటి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. వేసవిలో మహిళలకు మరింత అలసటగా ఉంటుంది. అలాంటప్పుడు అలసటను తరిమికొట్టాలంటే కొబ్బరి నీళ్లు తాగాల్సిందే. మరి కొబ్బరినీళ్లలో ఎన్ని సుగుణాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- గర్భిణులకు వాంతులు, వికారం లాంటి సమస్యలు ఎదురైనప్పుడు కొబ్బరినీళ్లు తాగితే సత్వర ఫలితం ఉంటుంది.
- కొబ్బరినీళ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని సంపూర్ణ పోషకాహారంగా చెబుతారు. కొబ్బరి నీళ్లను తాగితే డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు.
- రోజూ ఒక కొబ్బరి బొండం తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. జీర్ణప్రక్రియ పెంపొందుతుంది. మలబద్ధక సమస్యకు చెక్ పెట్టవచ్చు.
- మధుమేహ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు సహాయపడతాయి. ఇవి శరీరంలోని అధిక లవణాలను తొలగిస్తాయి.
- కొబ్బరి నీళ్లలో కొవ్వు లేనందున ఊబకాయం రాదు.
- కొబ్బరి నీళ్లు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి. రక్తపోటు, గుండెపోటులను నివారిస్తాయి.
- వేసవిలో వ్యాయామం చేసిన తర్వాత కొబ్బరినీళ్లు తాగితే అలసట తగ్గి ఉపశమనం కలుగుతుంది.
- వేడి చేయడం, కళ్ల మంటలు లాంటి ఇబ్బందులు కొబ్బరి నీళ్లు తాగితే తొలగుతాయి.