నిజాంపట్నం ఫస్ట్ బస్ అంటేనే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గుంటూరు బస్. విద్యార్థులు పోటీ పరీక్షలు నిమిత్తం, మత్స్య కారులు వ్యాపారం నిమిత్తం, ఉద్యోగులు వారి డ్యూటీల నిమిత్తం, అను నిత్యం రోజూ వారీ కూలీలు, కర్షక శ్రామికులు, రైతులు సైతం తమ వ్యవసాయ పనులకు ఉదయం 5 గం. ల గుంటూరు ఫస్ట్ బస్ ఎంతో ఉపయోగకరంగా ఉండేది. సుదూర ఏ పట్టణం, ఏ ప్రాంతం ప్రయాణం చేయాలన్న, నూతన జిల్లా బాపట్ల చేరుకోవాలన్న, ఒంగోలు, హైదరాబాద్, విజయవాడ, తెనాలి వంటి పట్టణాలకు బస్ సర్వీస్ లకు లింక్ కలపాలన్న ఈబస్ అత్యంత ప్రయోజనకారి. ఈ బస్ నిజాంపట్నం లో నైట్ హల్ట్ తిరిగి ఉదయం 5 గం. లకు గుంటూరు ప్రయాణం, అందరికి ఎంతోఉపయోగం గా, అనుకూలంగా ఉండేది. గత 10 రోజలు గా ఆగిపోయిన బస్ సర్వీస్ ను పునరుద్దరించ వలసినదిగా ప్రయాణికులు కోరుతున్నారు.