దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు బాగా పెరిగాయి. ఆ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడింది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయం వెల్లడైంది. ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇంధన వినియోగం బాగా తగ్గిందని తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగడమే ఇందుకు కారణం. మార్చి తొలి 16 రోజులతో పోల్చితే ఏప్రిల్ నెలలో 10 శాతం పెట్రోల్ వినియోగం తగ్గింది. డీజిల్ వినియోగం 15.6 శాతం, వంటగ్యాస్ వినియోగం 1.7 శాతం క్షీణించింది. గత 10 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండడం కొంత ఊరటనిస్తోంది.