ప్లాస్టిక్ బాటిళ్ల వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని నిల్వ చేసి తాగుతుంటే అది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు రోగనిరోధక శక్తిని దెబ్బతీసే అవకాశం ఉంది. అంతేకాదు ప్లాస్టిక్ బాటిళ్లలోని రసాయనాలు శరీరంపై తీవ్ర ప్రభావాలు చూపిస్తాయి. ప్లాస్టిక్‌లో ఉండే థాలేట్స్ అనే రసాయనాలు కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెరిగేలా చేస్తుంది. నీటిని వాటిల్లో ఎక్కువగా నిల్వ చేయడం వల్ల ఫ్లోరైడ్, ఆర్సెనిక్ ఉత్పత్తి అయ్యి శరీరానికి ప్రమాదాన్ని కొని తెస్తాయి. అంతేకాకుండా ప్లాస్టిక్ బాటిళ్లలో ఎక్కువ సమయం నీరు ఉంటే బ్యాక్టీరియా ఏర్పడి పొట్ట సమస్యలు కొనితెచ్చే అవకాశం ఉంది.