అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాలు-- నివారణ అనే అంశంపై ఆదివారం కొత్తపేట అపార్ట్మెంట్ల లోని ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించారు కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. గ్యాస్ లీకై మంటలు వ్యాపించినప్పుడు తడిగుడ్డ గానీ, గొనె బట్టను గానీ తడిపి సిలిండర్ ను చుట్టి మంటలను ఆర్పే విధానాన్ని చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.