కల్తీ పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఉయ్యురు మండల వ్యవసాయ అధికారి జి. వి శివప్రసాద్ హెచ్చరించారు. మండలంలో చాలా చోట్ల రైతులు ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు.పంటల పై ఆశించే చీడ పీడలపై పలు రకాల పురుగుమందులు విచక్షణా రహితంగా వాడుతున్నారు. వ్యవసాయ శాఖ పురుగుమందుల వాడకంపై అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పోటీతత్త్వం పంటకు హాని చేసే పురుగుల నివారణకు వాడవలసిన మందులపై సరైన అవగాహన లేకపోవటం వలన రైతులు అనేక రకాల పురుగుమందులు వాడుతున్నారని యిలా వాడటం వలన రైతులు ఆర్ధికంగా నష్టపోతున్నారు.
పురుగుమందుల అవశేషాలు మానవ మనుగడ పై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో పురుగుమందుల అమ్మకాల పై సరైన నిఘా ఉంచి కల్తీ లేని, గడువు తీరని నాణ్యమైన పురుగు మందులు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకునే విధంగా మండలం లోని పలు పురుగు మందుల దుకాణాల పై గ్రామ వ్యవసాయ సహాయకులతో కలిసి తనిఖీ లు చేపట్టటం జరిగింది.మండల వ్యవసాయ అధికారి జి వి శివ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అనదికారంగా ఎరువులు మరియు నకిలీ పురుగు మందులు విక్రయించినట్లు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అని హెచ్చరించారు. అదే విధంగా స్టాక్ రిజిస్టర్స్ మరియు నోటీస్ బోర్డ్ సక్రమంగా ఉంచాలి అని తెలియ చేశారు.విఏఏ అహల్య పలువురు వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.