* గంగవాయిలి కూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
* ఇందులోని విటమిన్-ఎ కళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
* రోగ నిరోధక శక్తిని పెంచడంలో గంగవాయిలి కూర సాయపడుతుంది.
* ఆరోగ్యకరమైన కణ విభజనకు గంగవాయిలి కూర దన్నుగా నిలుస్తుంది.
* ఇక, విటమిన్-సి శరీరంలో కొల్లాజెన్, రక్తనాళాలను మంచి స్థితిలో ఉంచడానికి, గాయాలను నయం చేయడానికి సహకరిస్తుంది.
* గంగవాయిలిలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది.
* ఎముకలకు అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం కూడా గంగవాయిలి కూరలో అధికంగా ఉంటాయి. అందువల్ల ఎముకల దృఢత్వానికి ఇది తోడ్పడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే ఎముకల సమస్యలను నివారిస్తుంది.
* ఈ ఆకుకూరలో ఉండే ఒమెగా-3 ఆమ్లాలు గుండెపోటు తదితర హృద్రోగాలను నివారిస్తాయి.