వేసవిలో మజ్జిగను ఎక్కువ సార్లు తాగుతుంటారు. కానీ వర్షాకాలంలో మాత్రం మజ్జిగను పక్కకు పెట్టేస్తారు. అయితే మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ఏ కాలంలోనైనా సరే మజ్జిగను తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మజ్జిగతో ఉన్న లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- మజ్జిగలో ఇంగువ, జీలకర్ర, సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరం తగ్గుతుంది.
- మజ్జిగను ఎక్కువగా తాగే వారిలో పైల్స్ తయారుకావు.
- దురదతో కూడిన అర్శమొలలకు వెన్నతో కూడిన మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే మల విసర్జన తరువాత మల ద్వారంలో వచ్చే మంట తగ్గుతుంది.
- ఎక్కిళ్లు వస్తున్నప్పుడు ఒక చెంచా మజ్జిగలో సొంఠి కలుపుకుని సేవించండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది.
- వాంతులయ్యేటప్పుడు మజ్జిగతో పాటు జాజికాయ పొడిని మజ్జిగలో కలుపుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.
- మజ్జిగలో వేయించిన జీలకర్ర కలుపుకుని తాగితే ఉపశమనం కలుగుతుంది.
- కాళ్ల పగుళ్ళకు మజ్జిగ నుంచి తీసిన తాజా వెన్నను పూస్తే ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- ఊబకాయంతో బాధపడేవారు ప్రతి రోజు క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకుంటే ఊబకాయ సమస్య నుండి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. మజ్జిగలో విటమిన్ బి12, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఉంటాయి. ఊబకాయ నివారణకు ఇవి ఎంతో సహకరిస్తుంది.
- వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంటుంది.
- ప్రతి రోజు మజ్జిగ తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది.
- మజ్జిగ తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విలువైన విటమిన్లు, మినరల్స్ అందుతాయి. - - - మజ్జిగకు శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది.
- ఉబ్బసం, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న సమయంలో మజ్జిగను వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa