దేశంలో మళ్లీ కరోనా అలజడి చెలరేగుతోంది. తాజాగా ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపింది. ఈమధ్య ఢిల్లీలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిలో ఓమిక్రాన్ BA.2.12.1 వేరింయంట్ ను అధికారులు గుర్తించడంతో అలర్ట్ అయ్యారు. ఈ వేరియంట్ చాలా ప్రమాదకమని అధికారులు తెలిపారు. ఓమిక్రాన్ BA.2 వేరియంట్ కన్నా ఈ కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తుందన్నారు.
BA.2.12.1 వేరియంట్ వల్లే ప్రపంచంలో ఎక్కువ కేసులు వెలుగుచూస్తున్నాయన్నారు. అమెరికాలోనే కాకుండా ఢిల్లీలో కూడా ఈ వేరియంట్ వల్ల కేసులు అధికమవుతున్నాయన్నారు. ఈ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చాక కేసుల సంఖ్య వందల్లో పెరుగుతోంది. కొత్త వేరియంట్ తో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు కరోనా నియమాలను పాటించాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు తప్పకుండా వినియోగించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa