ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు వారి ఖాతాల్లోకి డబ్బులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 22, 2022, 12:15 PM

ఏపీ ప్రభుత్వం శుక్రవారం స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఖాతాల్లో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం డబ్బులు జమ చేయనుంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది ఈ పథకం కింద జమ చేయనుంది.


9.76 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,02,16,410 మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగనుంది. సీఎం జగన్‌ శుక్రవారం ఒంగోలులో బటన్‌ నొక్కి నేరుగా మహిళల ఖాతాల్లో రూ.1,261 కోట్ల వడ్డీ సొమ్ము జమ చేయనున్నారు. ఈ సొమ్ముతో కలిపి ఇప్పటి దాకా ఈ పథకం కింద రూ.3,615 కోట్లు సాయం అందించినట్లవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa