వివాహేతర సంబంధం పెట్టుకొని, భార్యను హింసిస్తున్న వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మండలంలోని కవ్వగూడకు చెందిన వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం కాగా .. వెంకటేశ్వర్లు గత కొంత కాలంగా భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో భర్తను అరెస్ట్ చేసి, రిమాండు పంపినట్టు సీఐ తెలిపారు.