రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్నా, సుబిక్షంగా ఉండాలన్నా, కుట్రలు, కుతంత్రాలకు ప్రజలంతా దూరంగా ఉండాలన్నా ఇలాంటి వారు రాకూడదు. వారిపై ఏ దేవుడి అనుగ్రహం ఉండకూడదని అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు.చంద్రబాబుకు నిజంగా మంచి ఆలోచనలు ఉంటే, అమ్మవారి గుడికి పోయి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాటలు, వ్యవహారశైలి, ప్రజల గురించి అవహేళన మాటలు చూస్తుంటే, ఆయన రాజకీయాల్లో ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉందా? అనిపిస్తుందన్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో బుధవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడిన వీడియో చూపిన సజ్జల రామకృష్ణారెడ్డి అనంతరం మాట్లాడారు.