రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం బాపట్ల కలెక్టరేట్ లో వై. ఎస్. ఆర్. సున్నా వడ్డీ పధకాన్ని ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా బాపట్ల కలెక్టరేట్ సెమినార్ హాల్ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూరాష్ట్రములో డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం మూడు విడతల్లో కలిపి 3 వేల 511 కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తూచా తప్పు కుండా అమలు చేస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను ముఖ్యమంత్రి నాలుగు విడతల్లో చెల్లించడానికి చర్యలు తీసుకున్నార న్నారు. వై. ఎస్. అర్ సున్నా వడ్డీ పధకాన్ని మూడవ విడతగా 1261కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు అయన అన్నారు. ప్రతిపక్షాలు సంక్షేమ పథకాల అమలు పై లేనిపోనీ విమర్శలు చేస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రికి మహిళలు అండగా నిలవాలని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిన దానికంటే మిన్నగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. రాష్టానికి సంక్షేమ రధ సారథిగాముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు.
డిప్యూటీవ్ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వచ్చినా మహిళలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులు కారణం మహిళలు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి వై. ఎస్. ఆర్. సున్నా వడ్డీ పధకాన్ని అమలు చేస్తున్నారన్నారు.
బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగము సురేష్ మాట్లాడుతూ ప్రజలందరూ బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.
జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ మాట్లాడుతూ రాష్ర్టంలో డ్వాక్రా మహిళల సంక్షేమ కోసం ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. జిల్లాలో వై. ఎస్. ఆర్ సున్నా వడ్డీ పధకం క్రింద 3లక్షల 50 మందికి 46కోట్ల రూపాయలు వారి ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా వై. ఎస్. ఆర్ సున్నా వడ్డీ మెగా చెక్కు ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , దేవాదాయ శాఖ మంత్రి మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. శ్రీనివాసులు, డి. ఆర్. ఓ పెద్ది రోజా, రెవెన్యూ డివిజనల్ అధికారి జి. రవీంద్ర, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ నారాయణ, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.