మహిళలు ఎంత అందంగా ఉన్నా కూడా కంటి కింద నల్లటి వలయాల కారణంగా బయటకు రావడానికి, ఏదైనా ఫంక్షన్ లకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. నిద్రలేమి, డిప్రెషన్, ఒత్తిడి, ఎండలో తిరిగి వచ్చినప్పుడు, విటమిన్ బి-12 లోపం, అనారోగ్యం, రక్త శాతం తక్కువగా ఉన్నపుడు, అలసిపోయినప్పుడు కంటి కింద మచ్చలు లేదా నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. వీటినే మనం డార్క్ సర్కిల్స్ అని అంటాము.వీటినుండి విముక్తి పొందటానికి కింద తెలిపిన చిట్కాలను ఒక సారి ప్రయత్నించి చూడండి.. రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు...
--- పచ్చి పాలలో ముంచిన దూదితో కళ్ళ కింద మసాజ్ చేసుకోవడం వలన డార్క్ సర్కిల్స్ త్వరగా తగ్గిపోతాయి.
--- కొంచెం నిమ్మరసం, కొంచెం టమాటా రసం, కొద్దిగా శనగపిండి ని తీసుకుని మెత్తని మిశ్రమంలా చేసుకుని దానిని కళ్లకింద ఉన్న నల్లటి వలయాల మీద రాయాలి.
--- తేనెను నల్లటి మచ్చలపై రాసుకుని మసాజ్ చేసుకున్నా డార్క్ సర్కిల్స్ కి చెక్ పెట్టవచ్చు.