విజయవాడ లో హత్యాచారం ఘటన జరిగిన సంగతి అందరికి తెలిసిన విషయమే. భాధిధురాలుని పరామర్శించేందుకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ ప్రజలు ఆమెపై దాడి చెయ్యబోయ్యారు. ఆ ఘటన చంద్రబాబు చేయించాడు అని ఆమె అతనిపై కేసు నమోదుకి పిర్యాదు చేసింది. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతి కి న్యాయం చెయ్యమని అడగటమే నేరమైతే..మహిళల శీలానికి రేటు కట్టి ఉన్మాదులను రెచ్చిపోమంటూ విచ్చలవిడిగా రోడ్ల మీద వదిలేస్తున్న సిఎం గారికి ఎప్పుడు నోటీసులు ఇస్తారు?ఎప్పుడు విచారిస్తారు?మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గారూ అని ప్రశ్నించారు.