ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి వ్యాఖ్యలపై జనసేన నాయకులు కౌంటర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 23, 2022, 02:17 PM

ధర్మాదాయ శాఖ మాత్యులు, జిల్లా ఇన్చార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ కామెంట్స్ పై గుంటూరు జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివన్నారాయణ కౌంటర్ ఇచ్చారు. శనివారం బాపట్ల జనసేన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పవన్ కళ్యాణ్ ఒక్కడే కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టి సొంత నిధులు 5 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజా సమస్యలపై పోరాడటం మీ కళ్ళకు కనిపించదా అని జనసేన నాయకులు ఎద్దేవా చేశారు.


పట్టువదలని విక్రమార్కుడిలా ఎంత పెద్ద సమస్య అయినా సాధించే వరకు ఆయన విస్మరించాడు అన్నారు. ఉద్దానం , ఫాతిమా కాలేజ్ విద్యార్థులు వంటి సమస్యలపై పోరాడి విజయం సాధించారు, అధికా రంలో ఉండి మీరేం సాధించారు అని వారన్నా రు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోగన ఆదిశేషు, కొట్రా మణికంఠ, ఉసా ప్రసాద్, నాగమల్లేశ్వరరావు, తదితర పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com