గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీ అవార్డు కు కర్లపాలెం మండలంలోని దమ్మున్న వారి పాలెం గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరమ్మ ఎంపికైంది. గ్రామంలో నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ వాలంటీర్ సిబ్బంది సహకారంతో ఈ అవార్డు లభించింది అని ఆమె తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డుకు తమ గ్రామం ఎంపి కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఎంపిడిఓ ప్రసాద్ ఈవోపీఆర్డీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి గాయత్రి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa